దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, లియో మూవీని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. మాస్టర్ కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గానే తెరకెక్కింది కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. ఆ ఇంపాక్ట్ మాత్రం లియో సినిమాపై పడలేదు. లియో అనౌన్స్ అయినప్పుడు ఉన్న అంచనాలు ఇప్పుడు మరింత పెరిగాయి. సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ని రిలీజ్ చేసిన తర్వాత లియో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఉన్న హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ తోడైతే చాలు లియో మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో లియో సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యి… సెన్సేషనల్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.
ఇండియాలో కూడా లియో మూవీ బుకింగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడం గ్యారెంటీ. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లేకుండా లియో సినిమాకి ఈ రేంజ్ హైప్ క్రియేట్ అవ్వడం గ్రేట్ అనే చెప్పాలి. ఆడియో లాంచ్ లేకపోవడంతో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇస్తూ లోకేష్ కనగరాజ్ లియో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ లోకేష్ చెప్తున్నాడు. ముఖ్యంగా లియో సినిమా స్టార్టింగ్ 10 మినిట్స్ మిస్ అవ్వకండి, ఆ 10 మినిట్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది. దాని కోసమే లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ వర్క్ చేస్తూనే ఉన్నాం అని చెప్పాడు. లోకేష్ అదే పనిగా ఫస్ట్ 10 మినిట్స్ మిస్ అవ్వకండి అంటున్నాడు అంటే అది లియో సినిమాలో ఎంత స్పెషల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ స్పెషల్ సీన్స్ లో ఆడియన్స్ కి లోకేష్ ఎలాంటి థ్రిల్ ఇస్తాడో తెలియాలి అంటే అక్టోబర్ 19 వరకూ వెయిట్ చేయాల్సిందే.