Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress-TMC Merger: బెంగాల్ రాజకీయ పరిణామాలు, భారత రాజకీయలో కీలక మార్పులు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే మమతను ధిక్కరించి ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేశారు. దీంతో టీఎంసీ 4 ముక్కలుగా మారింది. ఎంపీలంతా కాకోలిఘోష్ దస్తీదార్ మద్దతు ప్రకటిస్తే, ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీ వైపు ఉన్నారు. దీంతో మమతా బెనర్జీకి వరసగా షాక్‌లు తగులుతూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్-టీఎంసీ విలీనం దిశగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గంటన్నర పాటు రాహుల్ గాంధీతో చర్చించడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించినట్లు మమత వర్గం స్పష్టం చేసింది. మరోవైపు, విలీనంపై తృణమూల్ నుంచే ప్రతిపాదన రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఈ విషయంలో తాము ఎలాంటి ఒత్తిడి చేయమంటూ చెబుతున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ మీటింగ్ ముందు మంగళవారం సోనియా గాంధీ, మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ భేటీ తర్వాత నుంచి టీఎంసీ కాంగ్రెస్‌లో విలీనం అవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
మరోవైపు, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలు కూడా విలీనంపై అనుమానాలు పెంచేలా చేసింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలు అంటేనే అవకాశాల కళ, రేపు ఏమైనా జరగొచ్చు. మా నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి, బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఆయన ఎన్నడూ రాజీ పడలేదు. రాహుల్ గాంధీ అనగారిన వర్గాల గొంతుక. ఆయనే ప్రధానమంత్రి కావాలి. దీనిని అంగీకరించే ఎవరికైనా కాంగ్రెస్ ద్వారాలు తెరిచే ఉన్నాయి. ’’ అని అన్నారు.
ఈ ఊహాగానాలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాహుల్, అభిషేక్ కలయికను యువరాజుల కలయికగా పేర్కొంది. వారు అధికారంలో కోసం ఏమైనా చేయగలరని, ఎవరినైనా ఆలింగనం చేసుకోగలరని విమర్శించింది. ఇదిలా ఉంటే, టీఎంసీ పార్టీ ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా చేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మను కలవడంతో ఆమె బీజేపీలో చేరుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాలను చూస్తే పార్టీ ఎంపీలు బీజేపీ వైపు ఉంటే, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ వైపు చూస్తోంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!