డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంతో రోడ్డు ప్రమాదాలకు ఆజ్యం పోసినట్లవుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అమాయకపు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 5 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం తమిళనాడులో చోటుచేసుకుంది.…
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలో ఉన్న తిరువళ్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి వేడి సాంబారు గిన్నెలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఓ 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.