అస్సాం రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.