Kathua Encounter : జమ్మూకశ్మీర్ లోని కథువాలో మూడో ఎన్ కౌంటర్ జరిగింది. తొమ్మిది రోజుల గ్యాప్ లో మూడుసార్లు భద్రతా దళాలకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. తాజాగా కథువాలో సోమవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. కథువా ఎగువ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా దళాలకు చిక్కారు. కథువా జిల్లాలోని సుదూర రామ్ కోట్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశాన్ని చుట్టేసింది. ఎందుకంటే వరుసగా ఇక్కట ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజులుగా ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
Read Also : Tamanna : మరో ఐటమ్ సాంగ్‌తో రాబోతున్న తమన్నా !
ఈ ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశానికి బలగాలను పంపించారు. కథువా జిల్లా హీరానగర్ సెక్టార్ లోని సన్యాల్ గ్రామం సమీపంలో మార్చి 23న తొలిసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఓ బాలిక గాయపడి ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మొదటిసారి ఎదురుకాల్పులు జరిపిన తర్వాత ఉగ్రవాదులు ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ నుంచి తప్పించుకున్నారు. దాంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెండోసారి మార్చి 27న కథువాలోని జుథానాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సారి నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.