Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Those Who Are Wanted India On Terrorists Killed By Unknown Gunmen In Pak

India: “వారు మాకు మోస్ట్ వాంటెడ్”.. పాక్‌లో ఉగ్రవాదుల హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు..

Published Date :December 7, 2023 , 5:38 pm
By Venu Goapl Reddy
India: “వారు మాకు మోస్ట్ వాంటెడ్”.. పాక్‌లో ఉగ్రవాదుల హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India: పాకిస్తాన్‌లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్‌కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.

‘‘ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వారు భారత న్యాయవ్యవస్థను ఎదుర్కోవాలని మేము కోరుకుంటున్నాము.. అయితే పాకిస్తాన్‌లో జరిగిన పరిణామాలపై నేను వ్యాఖ్యానించ లేను’’ అని అరిందమ్ బాగ్చీ అన్నారు. 2015 జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది హంజ్లా అద్నాన్‌న్ ఇటీవల కరాచీలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో చంపబడ్డారు. డిసెంబర్ 2 మధ్యరాత్రి వేళల్లో హంజ్లా అద్నాన్ తన ఇంటిలోనే కాల్చి చంపబడ్డాడు. ఇలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also: TS Cabinet Meeting: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్

డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులపై ప్రశ్నించినప్పుడు.. భారతదేశం ఎల్లప్పుడూ బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన అన్నారు. అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే యూఎస్, కెనడా అధికారులకు చెప్పామని, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఒక సమస్యపై మీడియా కవరేజీ కోరుకునేందుకే ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు.

మరోవైపు ఖతార్ ప్రభుత్వం భారత మాజీ నేవీ అధికారులు 8 మందికి మరణశిక్ష విధించడంపై మాట్లాడుతూ.. ఈ విషయాన్ని భారత్ నిశితంగా గమనిస్తోందని, అన్ని చట్టపరమైన, కాన్సులర్ సాయాన్ని అందిస్తామని చెప్పారు. జైలులో ఉన్న 8 మందిని కలవడానికి మా రాయబారికి యాక్సెస్ లభించిందని, ఇది చాలా సున్నితమైన సమస్య అని ఆయన చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arindam Bagchi
  • india
  • killing of terrorists
  • MEA
  • Pakistan

తాజావార్తలు

  • మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!

  • Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో కీలక చర్చలు..

  • Successful Lady Producers : నిర్మాతలుగా సక్సెస్ అందుకున్న అక్కాచెల్లెళ్లు

  • NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

  • Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions