Site icon NTV Telugu

Rahul Gandhi : “ఆపరేషన్ సిందూర్‌”పై రాహుల్ గాంధీ స్పందన ఇదే..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో విరుచుకుపడ్డాయి. పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సులోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో భారత్ విరుచుకుపడింది. మొత్తం 09 స్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారుగా 80-100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థల కార్యాలయాలు, వాటి ట్రైనింగ్ సెంటర్లని పూర్తిగా నేలమట్టం చేశారు.

ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. భారత సాయుధ దళాల ప్రతీకార దాడులకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సైన్యం తీసుకున్న చర్యల్ని ఆయన ప్రశంసించారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన భద్రతా దళాలకు చాలా ప్రేమతో శుభాకాంక్షలు చెబుతున్నారనని అన్నారు.

Read Also: Operation Sindoor: యుద్ధానికి కారణమైన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?

రేపు కేంద్రం నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరవుతుందని రాహుల్ గాంధీ ధ్రువీకరించారు. పాకిస్తాన్, పీఓకే నుంచి ఉత్పన్నమయ్యే అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. “జాతీయ ఐక్యత మరియు సంఘీభావం ప్రస్తుత అవసరం మరియు భారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది. గతంలో మన నాయకులు ఈ మార్గాన్ని చూపించారు . జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది” అని ఆపరేషన్ సిందూర్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావలకోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ అంతటా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

Exit mobile version