Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో వందలాది మంది మరణించడం దేశాన్ని కలిచివేసింది. లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ ఆయిన 36 క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 ప్రయాణికులలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. నేలపై ఉన్న వారిలో కలిపి 280 మంది వరకు మరణించారు.
Read Also: Kishan Reddy: రేపు ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్రమంత్రి
అయితే, ఈ ప్రమాదంలో ఇంజన్ల ఫెయిల్యూర్ వల్లే విమానం టేకాఫ్ కాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంపై ఎయిరిండియా ఎండీ కాంప్‌బెల్ విల్సన్ గురువారం స్పందించారు. విమానం కుడి ఇంజన్‌ను మార్చి 2025లో మార్చామని, ఎడమ ఇంజన్ ఏప్రిల్‌లోనే తనిఖీ చేసినట్లు చెప్పారు. విమానం ప్రధాన తనిఖీ జూన్ 2023లో జరిగిందని, డిసెంబర్ 2025లో మరో షెడ్యూల్ ఉందని చెప్పారు. ప్రమాదానికి ముందు విమానం కానీ విమాన ఇంజన్లు కాని ఎలాంటి సమస్య చూపించలేదని చెప్పారు. పైలట్లు కెప్టెన్ సుమీత్ సభర్వాల్ మరియు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ – 13,400 గంటల విమానయాన అనుభవాన్ని కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.