Punjab Haryana High Court: వీధుల్లో తిరుగుతూ దొరికింది తింటూ ఊర్లోకి కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళను చూసి అరుస్తూ ఊరిని కాపలా కాసే శునకాలు గ్రామ సింహాలుగా ప్రసిద్దికెక్కాయి. వీటి వల్ల ఉపయోగాలు ఉన్న ఈ ఊర కుక్కల దాడిలో ప్రజలు ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఉదయం పూట వాకింగ్ కి వెళ్లిన వాళ్లలో కూడా చాలామంది ఈ ఊర కుక్కల బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా కుక్కల దాడిలో నమోదైన కేసుల విషయంలో పంజాబ్ హర్యానా హై కోర్టు సంచలన తీర్పుని వెల్లడించింది. ఇక ముందు గ్రామసింహాలు (ఊర కుక్కలు), ఇతర మూగ జీవుల దాడిలో ఎవరైనా గాయాడితే.. గాయపడిన వాళ్ళకి నష్ట పరిహారం చెల్లించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.
Read also:Uttarakhand: ఉత్తరఖండ్ టన్నెల్ ఘటన.. ఇబ్బందుల్లో పడ్డ 40 మంది జీవితాలు
వివరాల్లోకి వెళ్తే.. వీధుల్లో నివసించే మూగ జీవుల దాడులకు సంబంధించి నమోదైన 193 పిటీషన్లను పంజాబ్-హర్యానా హై కోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో ఎవరైనా వ్యక్తి కుక్క గాటుకు గురైతే ఆ వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పంటి గాటుకు రూ/ 10 వేలు నష్టపరిహారం చెల్లించాలని.. తీవ్ర గాయం అయినయెడల రూ/ 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలానే గాడిదలు, ఆవులు, ఎద్దులు,శునకాలు , గేదెలు, అడవి జంతువుల తో పాటుగా పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని ని ఏర్పాటు చెయ్యాలని పంజాబ్- హర్యానా తో పాటుగా చండీగర్ పాలనా విభాగాలను ఆదేశించింది.