An Old Man Lost 15 lakhs After Video Call With Girl In Hyderabad: ఆన్‌లైన్ మోసాలు ఎన్నో వెలుగుచూస్తున్నప్పటికీ.. జనాల్లో మార్పు రావడం లేదు. అమ్మాయి పేరు నుంచి ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ వస్తే చాలు.. అది నిజమైందా? ఫేకా? అనేది నిర్ధారించుకోకుండా, చాటింగ్‌లు చేస్తున్నారు. అవతల నుంచి న్యూడ్ వీడియో కాల్ చేయమంటే చాలు.. టెంప్ట్ అయిపోయి, వెంటనే ఆ పాడు పనులకి పాల్పడుతున్నారు. ఆ తర్వాత.. అవతలి నుంచి వచ్చే ఝలక్‌లు, ట్విస్టుల దెబ్బకు లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతి వలలో పడి, 79 ఏళ్ల వృద్ధుడు లక్షలకు లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Power Bill: ఖాళీ పోర్షన్‌కు రూ.7 లక్షల బిల్లు.. షాక్ లో ఇంటి యజమాని
హైదరాబాద్ నగరానికి చెందిన 79 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి.. ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లోనే ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పట్లాగే ఫోన్ చూసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తుండగా.. కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయి గొంతుతో ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ఇద్దరు కాసేపు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. తన వయసు 20 సంవత్సరాలేనని, ఒంటరిగా ఉన్నానని, తోడు కోసం చూస్తున్నానంటూ.. ఆ యువతి ఊరించింది. దాంతో.. ఆ వృద్ధుడు టెంప్ట్ అయిపోయాడు. అంతేకాదు.. ‘మీరు నా బావ లాంటి వారు, మీతో మాట్లాడాలని ఉంది’ అని చెప్పగానే, ఆయన ఫ్లాట్ అయిపోయాడు. ఆ యువతితో మాటలు కలిపాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం.. ఆ యువతి కాల్ కట్ చేసింది. రెండు గంటలయ్యాక తిరిగి వీడియో కాల్ చేసింది. ‘ఐ లవ్ యు’ అంటూ ప్రపోజ్ చేసింది.
Beauty Tips: ఈ జ్యూస్ ను ఒక్కసారి తాగితే చాలు.. నిత్య యవ్వనంగా ఉంటారు..
అలా తన మాటలతో ఆ వృద్ధుడిని ముగ్గులోకి దింపిన ఆ యువతి.. బాత్రూంలోకి వెళ్లి బట్టలు విప్పేయాలని చెప్పింది. ముందు వెనుక ఆలోచించకుండా.. ఆ వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి బట్టలన్నీ విప్పేశాడు. అప్పుడే ఆ యువతి అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తతంగం మొత్తం రికార్డ్ చేసిన యువతి.. డబ్బులిస్తావా? లేకపోతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పంపమంటావా? అంటూ బెదిరింపులకు దిగింది. పరువు పోతుందన్న భయంతో.. ఆ వృద్ధుడు ఆమెకి రూ.15 లక్షలు సమర్పించుకున్నాడు. ఇంకా కావాలని డిమాండ్ చేయడంతో.. మరో దారి లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.