ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ అందరి దృష్టి సలార్ సినిమాపైనే ఉంది. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కి కింగ్ అయిన ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్, ఇటీవలే కాలంలో ఏ సినిమా క్రియేట్ చెయ్యలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం అనే నమ్మకం ప్రతి సినీ అభిమానిలో ఉంది. ట్రేడ్ వర్గాలు సలార్ కలెక్షన్స్ ఊహించడం కూడా కష్టమే అంటున్నారు. ఈ రేంజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆదిపురుష్ సినిమా కోసం వెయిట్ చేసిన ప్రశాంత్ నీల్ అండ్ టీం, ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ అయిపొయింది కాబట్టి సలార్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే సలార్ టీజర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వీక్ లో ఏ క్షణం అయినా సలార్ టీజర్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న రిలీజ్ షెడ్యూల్ అయిన సలార్ సినిమా కౌంట్ డౌన్ ని కూడా ఫాన్స్ స్టార్ట్ చేసేసారు.
ఈ కారణంగా సలార్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలాంటి సమయంలో సలార్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. KGF సినిమాలని మదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో చేసిన ప్రశాంత్ నీల్… సలార్ సినిమాని ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ తో వర్కౌట్ చేస్తున్నాడట. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ అనేవి జస్ట్ కథలో ఎలిమెంట్స్ మాత్రమే ఎండ్ ఆఫ్ ది డే ప్రశాంత్ నీల్ సాలిడ్ ఎలివేషన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు కాబట్టి స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడం కన్నా ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకునే క్యారెక్టర్ గా ప్రభాస్ కనిపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సలార్ సినిమా 2K తో పాటు IMAX వెర్షన్ లో కూడా రిలీజ్ కానుందని సమాచారం. డార్క్ సెంట్రిక్ థీమ్ తో బాట్ మ్యాన్ ఇంపాక్ట్ రేంజులో రూపొందుతున్న సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని ఎంతగా కుదిపేస్తుందో చూడాలి.