తెలుగు ఆడియన్స్ తో ఫ్యామిలీ స్టార్ గా పేరు పొందిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంది. వెంకటేష్ ఎన్నో ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. ప్రేక్షకులను నవ్వించడం లో అయిన అలాగే సెంటిమెంట్ పండించి కన్నీళ్లు రప్పించాలన్నా వెంకటేష్ వల్లనే సాధ్యం.మాస్ ఆడియన్స్ కు కూడా వెంకటేష్ సినిమాలు అంటే ఇష్టం.ఎలాంటి కథలో అయిన వెంకటేష్ తనదైన యాక్టింగ్ తో అందరినీ మెప్పిస్తాడు. వెంకటేష్ అన్నీ వర్గాల ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించాడు.
నేటి తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలను చేయడం మొదలు పెట్టింది కూడా వెంకటేష్ అని చెప్పాలి.సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆయన కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. వెంకటేష్ కి అర్జున్ అనే కొడుకు ఉన్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. అర్జున్ కి ఇప్పుడు 18 ఏళ్ళు వయసు నిండింది.. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నట్లు సమాచారం. వెంకటేష్ కొడుకు అతి త్వరలోనే హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొత్తం పూర్తి అయ్యాయని సమాచారం. అయితే అర్జున్ దగ్గుపాటి మొదటి చిత్రానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఒక అద్భుతమైన స్టోరీ అన్నీ వర్గాలకు నచ్చే ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథని సిద్ధం చేసాడట త్రివిక్రమ్. ఆ కథ వెంకటేష్ కి కూడా ఎంతగానో నచ్చింది. వచ్చే ఏడాది లోనే అర్జున్ గ్రాండ్ డెబ్యూ మూవీ ఉండే అవకాశం ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.వెంకటేష్ గత ఏడాది F3 సినిమాతో అలాగే ఈ ఏడాది ‘రానా నాయుడు’వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన హిట్ సినిమా దర్శకుడు శైలేష్ తో ‘సైంధవ్ ‘ అనే చిత్రాన్ని చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.