ప్రళయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం: డీఆర్‌డీఓ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన’ప్రళయ్’ క్షిపణిని బుధవారం ఒడిశా తీరంలో అబ్దుల్ కలామ్ దీవి నుండి డీఆర్‌డీఓ విజయవంతంగా ప్రయోగించింది. ”ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నేరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలోనే పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి.” అని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. క్వాసి మిస్సైల్ ట్రాజెక్టరీ కూడా బాలిస్టిక్ క్షిపణి పథంగానే వుంటుంది.
నిర్దిష్ట దూరం చేరుకున్న తర్వాత ఇది, అడ్డు వచ్చిన వాటిని దెబ్బతీయడానికి తన పంథాను మార్చుకుంటుందని రక్షణ అధికారులు వివరించారు. క్షిపణి తాకే పాయింట్‌కు సమీపంలో తూర్పు తీరం పొడవునా మోహరించిన సెన్సార్లు, దిగువున గల నౌకలు ఈ క్షిపణి మార్గాన్ని ట్రాక్ చేశాయని డీఆర్‌డీఓ తెలిపింది. సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్‌తో ఈ క్షిపణి పనిచేస్తుంది. మొబైల్ లాంచర్ నుండి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ క్షిపణి కొత్త తరం క్షిపణి అని డీఆర్‌డీఓ చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.‘‘క్వాజీ బాలిస్టిక్ మిసైల్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు నా అభినందనలు. ఇది కీలకమైన మైలురాయి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Congratulations to @DRDO_India and associated teams for the maiden development flight trial. My compliments to them for the fast track development and successful launch of modern Surface-to-Surface Quasi Ballistic missile. It is a significant milestone achieved today. pic.twitter.com/woixwxdxjb
— Rajnath Singh (@rajnathsingh) December 22, 2021
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!