ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన’ప్రళయ్’ క్షిపణిని బుధవారం ఒడిశా తీరంలో అబ్దుల్ కలామ్ దీవి నుండి డీఆర్‌డీఓ విజయవంతంగా ప్రయోగించింది. ”ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నేరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలోనే పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి.” అని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను…