Lok sabha: లోక్‌సభ ముందుకు 3 కీలక బిల్లులు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు
- లోక్‌సభ ముందుకు కీలక బిల్లులు
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు. 30 రోజులు జైల్లో ఉంటే ప్రజా ప్రతినిధి పదవి రద్దయ్యేలా బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు రాజకీయ దుర్వినియోగానికి దారి తీసే అవకాశం ఉందని.. దేశ సమాఖ్య విధానానికి విరుద్ధం అని విపక్ష ఎంపీలు ధ్వజమెత్తారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారని కేసీ.వేణుగోపాల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. మొత్తానికి ప్రతిపక్ష ఎంపీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gujarat: అహ్మదాబాద్‌లో దారుణం.. టెన్త్ విద్యార్థిని చంపిన జూనియర్
Also Read
- CAG Railway Report: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా?.. CAG రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు
- Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
అలాగే ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే కీలక బిల్లును కూడా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళన నడుమ ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. కాసేపటికే సభ వాయిదా పడింది. ఆన్‌లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. మరోవైపు ఈ బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అమిత్‌షాకు లేఖ రాసింది.
ఇది కూడా చదవండి: Rekha Gupta: రేఖా గుప్తాపై దాడికి సుప్రీంకోర్టు తీర్పే కారణమా?
తాజావార్తలు
-
Bigg Boss Telugu Season10:’బిగ్ బాస్10′ తెలుగు సీజన్ కు నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. 10 సర్ప్రైజ్లతో కొత్త సీజన్, ప్రోమో వైరల్!
-
Sarfaraz Khan: ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు.. అయినా తగ్గేదేలే.. మ్యాచ్ ఆసాంతం సర్ఫరాజ్ ఏం చేశాడంటే!
-
Bollywood : ఒకే ఏడాది 4 సినిమాలు.. 4 విభిన్న జానర్లు.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదు
-
CAG Railway Report: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా?.. CAG రిపోర్ట్‌లో సంచలన విషయాలు
-
Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!