Jammu Kashmir: కథువాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం..
- జమ్మూలో ఎన్కౌంటర్..
- కథువాలో ఉగ్రవాది హతం..
- రియాసి ఉగ్రదాడి తర్వాత మరో ఘటన..
- ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాల ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)కి సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలోని సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడి గురించి అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. కథువా ఎస్పీ అనయత్ అలీ చౌదరి ఎన్కౌంటర్ స్థలంలోనే ఉన్నారు. గ్రామస్తులు ముగ్గురు సాయుధులను గుర్తించిన తర్వాత అధికారులను అప్రమత్తం చేశారు. ముష్కరులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయేందుకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు, బీఎస్ఎఫ్ అనుమానిత వ్యక్తుల కోసం జాయింట్ ఆపరేషన్ ప్రారంభించింది.
Read Also: Delhi: విద్యుత్ సంక్షోభంపై కేంద్రానికి మంత్రి అతిషి లేఖ
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
రెండు రోజుల వ్యవధిలో జమ్మూలో రెండు ఉగ్రదాడులు జరిగాయి. ఆదివారం రియాసీ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఈ దాడి వెనక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా ఉగ్రవాదుల్ని గుర్తించేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. రాన్సో-పోనీ-ట్రియాత్ బెల్ట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను మోహరించారు. పారిపోతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోలీస్, ఆర్మీ, సీఆర్పీఎఫ్కి చెందిన 11 టీములు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి.
#WATCH | Jammu and Kashmir: One terrorist killed in firing in village Saida Sukhal in Hiranagar sector. Security forces are present at the spot; the operation going on.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/fpm48nJKDp
— ANI (@ANI) June 11, 2024
I am in continuous online contact with DC #Kathua Sh Rakesh Minhas in the wake of terrorist attack on a house in village Saida in Hiranagar sector close to the International Border. I am also in touch with SSP Kathua Sh Anayat Ali Choudhary who is on the spot. The owner of
1/2— Dr Jitendra Singh (@DrJitendraSingh) June 11, 2024
తాజావార్తలు
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!