Telegram: టెలిగ్రామ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. “డార్క్‌వెబ్”గా మారిందన్న కేంద్రం..
- టెలిగ్రామ్‌ను "కొత్త డార్క్ వెబ్"గా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం.
- బాలల అశ్లీల కంటెంట్, ఉగ్రవాద ప్రచారం ఆరోపణలు.
- NEET పేపర్ లీకులు, సైబర్ మోసాలకు వేదికగా మారిందని వ్యాఖ్య.
- ఆధార్, మొబైల్ డేటా విక్రయాలకు సంబంధించిన బాట్లపై ఆందోళన.
- ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telegram: టెలిగ్రామ్‌కు ఉచ్చు బిగుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు టెలిగ్రామ్‌పై కేంద్ర బ్యాన్ విధించింది. ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతిగా ఈ యాప్ ‘‘డార్క్ వెబ్’’గా మారిందంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు, ఇతర ప్రమాదకారులు దీనిని ఎక్కువగా వాడుతున్నారని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. నేరపూరిత నెట్‌వర్క్‌లు, తీవ్రవాద గ్రూపుల ద్వారా టెలిగ్రామ్ దుర్వినియోగం పెరుగుతోందని కేంద్రం వివరించింది.
నీట్ వంటి లీకైన పరీక్ష పత్రాల వ్యాప్తి, సైబర్ మోసాలు, ఉగ్రవాద సంబంధిత ప్రచారం, బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలతో సహా అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఒక కీలక వేదికగా మారిందని ప్రభుత్వం ఆరోపించింది. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్ల ద్వారా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కంటెంట్, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. సామాజిక అశాంతి సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని కోర్టుకు వెల్లడించింది. టెలిగ్రామ్‌లో ప్రైవసీ ఫీచర్ల ద్వారా నేరపూరిత నెట్‌వర్క్‌లను అధికారులు గుర్తించడం కష్టంగా మారిందని కేంద్రం తెలిపింది.
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
టెలిగ్రామ్ ఛానెల్‌లు, గ్రూపుల ద్వారా బాలల లైంగిక దోపిడీ, దుర్వినియోగం(CSEAM) ఎక్కువ అవుతోందని కేంద్రం పేర్కొంది. టెలిగ్రామ్ ద్వారా నకిలీ అకౌంట్లు సృష్టించి సైబన్ మోసాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వివరాలు, మొబైల్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం వంటి డేటాను విక్రయించే బాట్లు కూడా టెలిగ్రామ్‌లో పనిచేస్తేన్నాయని ఆరోపించింది. సైబర్ నేరాల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల కొనుగోలు, అమ్మకాలు కూడా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయని వెల్లడించింది. కొన్ని ఛానెళ్లు మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్, భద్రతా వ్యవస్థల్ని తప్పుంచుకునే సాఫ్ట్వేర్లను వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు టెలిగ్రామ్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌గా ఉపయోగించి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నాయని తెలిపింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కంటెంట్‌ను అక్రమంగా వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!