Chennai Love Story:’చెన్నై లవ్ స్టోరీ’ గ్రాండ్ సక్సెస్ మీట్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్, నాగచైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్’ విజయోత్సవ వేడుక ఈ రోజు ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు, నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను వేదికపై పంచుకోవడంతో సక్సెస్ మీట్ భావోద్వేగంగా సాగింది. అలాగే ముఖ్య అతిధిగా నాగచైతన్య రావడంతో సక్సెస్ మీట్ మరింత కనుల పండుగగా జరిగింది.
వేదికపై హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, నటుడు నాగచైతన్య తనకు ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తుచేశారు. ఆయన నటించే ప్రతి సినిమా విజయవంతం కావాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. ఈ సినిమాకు అతిథిగా వచ్చి తమ మూవీకి మద్దతు ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే దర్శకుడు రవి చెప్పిన ఇంటర్వెల్ సన్నివేశం విన్న సమయంలో తన సొంత అన్న గుర్తుకు వచ్చాడని, పిల్లలకు స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో ఆయన మరణించారని భావోద్వేగానికి గురయ్యారు. చివరగా జూనియర్ ఎన్టీఆర్ తరహాలో అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
Also Read
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
నిర్మాత ఎస్కేఎన్ కూడా తనదైన శైలిలో మాట్లాడుతూ, సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత మాట్లాడతాడని, రిలీజ్ తర్వాత సినిమా మాత్రమే మాట్లాడుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిందని వెల్లడించారు. ప్రస్తుతం చాలామంది కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నా, కిరణ్ అబ్బవరం సినిమాకు ప్రేక్షకులు టికెట్ కొనొచ్చనే నమ్మకం సంపాదించుకోవడం ఇంకా పెద్ద విజయమని పేర్కొన్నారు. హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు ఇకపై మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమాకు నాగచైతన్య మద్దతు ఇవ్వడం తమకు పెద్ద గుర్తింపుగా భావిస్తున్నామని చెప్పారు. మైత్రి మూవీస్ నిర్మాత రవి సినిమా చూసిన తర్వాత పదేపదే అభినందించారని కూడా వెల్లడించారు.
ఇదే ప్రెస్ మీట్ లో ముఖ్య అతిధిగా విచ్చేసిన నాగచైతన్య మాట్లాడుతూ… హీరోయిన్ గౌరీప్రియ నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. నటిగా తనలోని కొత్త కోణాన్ని గౌరీప్రియ ఈ సినిమాతో నిరూపించుకున్నారని అన్నారు. ఈ సినిమా విజయాన్ని కేవలం పోస్టర్లపై కలెక్షన్ నంబర్ల ద్వారా కొలవలేమని నాగచైతన్య స్పష్టం చేశారు. ప్రేక్షకుల ప్రేమ, థియేటర్లలో వస్తున్న స్పందన అసలైన విజయానికి ప్రమాణాలని చెప్పారు. సంగీత దర్శకుడు మణిశర్మ గురించి కూడా నాగచైతన్య ప్రశంసలు కురిపించారు. ఈ రోజుల్లోనూ తన ప్రత్యేకమైన క్లాసిక్ సంగీత శైలిని కొనసాగిస్తూ, ఈ సినిమాకు అద్భుతమైన హిట్ ఆల్బమ్ అందించారని అన్నారు. నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు సక్సెస్ మీట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ప్రేమకథలపై ఆయన చేసిన విశ్లేషణ, కిరణ్ అబ్బవరం ఎదుగుదలపై చెప్పిన మాటలు అక్కడున్న అందరినీ ఆకట్టుకున్నాయి.
రచయిత సాయి రాజేష్ మాట్లాడుతూ, తాను రచన చేసిన తొలి నాలుగు సినిమాలకు మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చిందని గుర్తు చేశారు. ‘బేబీ’ విడుదల సమయంలో తాను, ఎస్కేఎన్ కలిసి ప్రసాద్ ల్యాబ్‌లో కూర్చొని ఏడ్చిన సందర్భాన్ని పంచుకున్నారు. అదే పరిస్థితి ఈ సినిమాకు రాకూడదని భావించినా, ప్రీమియర్ షోల తర్వాత కూడా రెండో భాగంపై కొన్ని విమర్శలు వచ్చాయని చెప్పారు. అయితే సోమవారం థియేటర్లో ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూసిన తర్వాత సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యిందనే నమ్మకం వచ్చిందన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరీప్రియ మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభ దశలోనే ఇంత అద్భుతమైన పాత్ర దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలుగు అమ్మాయిగా తనకు ఈ అవకాశం ఇచ్చిన సాయి రాజేష్, ఎస్కేఎన్, ధీరజ్లకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు తనను పూర్తిగా ‘నివి’ పాత్రగా మలిచారని, ఆయన విజయం తన విజయంగా భావిస్తున్నానన్నారు. సినిమా పాటలకు వస్తున్న ఆదరణ చూస్తే తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ప్రేక్షకులు తన నుదిటిపై కనిపించిన చిన్న నరం వరకు గమనించి ప్రశంసించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇటీవల మారువేషంలో థియేటర్‌కు వెళ్లినప్పుడు మొదటి రోజు లాగానే హౌస్‌ఫుల్ స్పందన కనిపించడం తనకు ఎంతో సంతోషం ఇచ్చిందని చెప్పారు.
దర్శకుడు రవి నంబూరి కూడా సరదాగా మాట్లాడుతూ, సినిమా కోసం ఎంత కష్టపడినా నిర్మాత ఇప్పటికీ తనకు కొత్త ఫోన్ కొనివ్వలేదని నవ్వులు పూయించారు. ఇక సినిమా విజయంతో కుటుంబానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నానని, తదుపరి సినిమా ప్రారంభమయ్యే వరకు తన కుమారుడిని స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్తానని చెప్పారు. నిర్మాత మైత్రి నవీన్ మాట్లాడుతూ, అన్నపూర్ణ ప్రివ్యూలోనే సినిమా చూసినప్పుడు ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పానని గుర్తు చేశారు. ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన వసూళ్లు నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ సక్సెస్ మీట్ చూస్తుంటే ‘చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్’ విజయాన్ని చిత్ర బృందం ఎంత భావోద్వేగంగా ఆస్వాదిస్తుందో స్పష్టంగా కనిపించింది.
- Tags
- Chennai Love Story
- cinema
తాజావార్తలు
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!