Tejashwi Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యంత దారుణ పరాజయాన్ని చవిచూసింది. 243 సీట్లలో కేవలం 25 సీట్లలోనే గెలిచింది. ఇక ఆర్జేడీ – కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి మొత్తంగా 35 సీట్లతో పరాభవాన్ని ఎదుర్కోంది. మరోవైపు, ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాలు సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85 సీట్లతో పాటు మిగిలిన భాగస్వామ్య పార్టీలు మంచి సంఖ్యలో సీట్లను గెలుచుకున్నాయి. ఆర్జేడీ ఈ రేంజ్ లో పరాజయం పాలవుతుందని ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా ఊహించలేదు.
ఇదిలా ఉంటే, ఈ ఓటమి ఆర్జేడీలో, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పెను దుమారానికి కారణమైంది. ఇప్పటికే, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై చెప్పంది. తన ఫ్యామిలీతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించింది. శనివారం, ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ మొత్తం పరిణామాలకు తేజస్వీ యాదవ్ సన్నిహితులు కారణమని ఆరోపించింది.
ఇప్పుడు పరి‘వార్’లో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం జరిగిన వాదనల్లో తేజస్వీ యాదవ్, తన అక్క రోహిణి ఆచార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతే కాకుండా ఆమెపై చెప్పు విసిరేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ‘‘నీ వల్లే మేము ఎన్నికల్లో ఓడిపోయాము, నువ్వే మమ్మల్ని శపించావు’’ అని తన అక్కపై విరుచుకుపడినట్లు సమాచారం. ఆ తర్వాత కోపంతో ఆమెపైకి చెప్పు విసిరేసి, తీవ్ర స్థాయిలో దుర్భాషలాడినట్లు తెలుస్తోంది.
Read Also: Women marriage With AI: మగాళ్లపై విరక్తి చెందిన మహిళ.. ఓదార్పు కోసం ఏఐతో పెళ్లి..
ఆర్జేడీ అధినేత లాలూ కు 9 మంది సంతానం. ఇందులో రోహిణి ఆచార్య శనివారం తన కుటుంబాన్ని వదిలేస్తున్నట్లు ప్రకటించారు. లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే ఆర్జేడీ నుంచి బహిష్కరించబడి, కొత్త పార్టీ పెట్టుకున్నాడు. మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. రోహిణి తమ కుటుంబంలో విభేదాలకు తేజస్వీ సన్నిహితులు సంజయ్ యాదవ్, ఆయన మిత్రుడు రమీజ్ నేమత్ ఖాన్‌లు కారణమని ఆరోపించారు.
‘‘నాకు ఇప్పుడు కుటుంబం లేదు. వెళ్లి సంజయ్, రమీజ్, తేజస్వి యాదవ్‌లను అడగండి. వారు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడనందున నన్ను కుటుంబం నుండి బయటకు పంపేశారు. ఆర్జేడీ ఇంత ఘోరం ఎలా ఓడిపోయిందని ప్రపంచం అడుగుతోంది’’ అని ఆమె అన్నారు. ‘‘ మీరు సంజయ్, రమీజ్ ను ప్రశ్నిస్తే మమ్మల్ని ఇంటి నుంచి పంపారు. మీ పరువు తీస్తారు. మీపై చెప్పులతో దాడి చేస్తారు’’ అని ఆమె ఆరోపించింది. ఈ రోజు ఉదయం మరో పోస్టులో తనను నిన్న అవమానించారు అని ఆమె చెప్పింది.
‘‘ నిన్న ఒక బిడ్డను, ఒక సోదరిని, ఒక వివాహితను, ఒక తల్లిని అవమానించారు. అసభ్యకరమైన తిట్లు తిట్టారు. చెప్పు విసిరారు. నేను నా ఆత్మగౌరవంపై రాజీ పడను. నేను సత్యాన్ని వదులుకోను. ఈ కారణంగా నేను అవమానాన్ని భరించాల్సి వచ్చింది’’ అని ఆమె హిందీలో రాసింది. తల్లిదండ్రుల్ని, సోదరీమణుల్ని బలవంతంగా వదలాల్సి వచ్చింది, వారు నన్ను అనాథగా వదిలేశారు. ’’ అని అన్నారు. నా తండ్రి (లాలూ)కు కోట్ల రూపాయలు తీసుకుని కిడ్నీ ఇచ్చానని ఆరోపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కిడ్నీ ఇచ్చేటప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, నా అత్తమామల్ని అడగకపోవడం పాపంగా మారిందని అన్నారు.
I’m quitting politics and I’m disowning my family …
This is what Sanjay Yadav and Rameez had asked me to do …nd I’m taking all the blame’s— Rohini Acharya (@RohiniAcharya2) November 15, 2025
कल एक बेटी, एक बहन , एक शादीशुदा महिला , एक माँ को जलील किया गया , गंदी गालियाँ दी गयीं , मारने के लिए चप्पल उठाया गया , मैंने अपने आत्मसम्मान से समझौता नहीं किया, सच का समर्पण नहीं किया , सिर्फ और सिर्फ इस वजह से मुझे बेइज्जती झेलनी पडी ..
कल एक बेटी मजबूरी में अपने रोते हुए…— Rohini Acharya (@RohiniAcharya2) November 16, 2025