Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- బెంగాల్లో బీజేపీ గెలుపుపై బంగ్లా అధికార పార్టీ ఆనందం..
- తీస్తా నది వివాదంపై ఒప్పందం కురుతుందని ఆశాభావం..
- మమతా బెనర్జీ ఒప్పందాన్ని అడ్డుకుందన్న బీఎన్పీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిక్ నేతలు ఆందోళన భయాలు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు, బీజేపీ గెలుపుతో కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం మాత్రం ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రెండు దేశాల మధ్య తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా బెనర్జీ అడ్డుకున్నారని బీఎన్పీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బీజేపీ గెలుపు సహాయపడుతుందని చెబుతోంది.
బీఎన్పీ సమాచార కార్యదర్శి అజీజుల్ బారి హెలాల్, సువెందు అధికారి నాయకత్వంలో బీజేపీ పనితీరును ప్రశంసించారు, భవిష్యత్తులో కూడా సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న తీస్తా వివాదం ఇప్పుడు చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఎన్నికల్లో గెలిచినందున తీస్తా బ్యారేజీ ఒప్పందం ముందుకు సాగుతుందని అన్నారు.
Also Read
- Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్‌మహల్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
ఏమిటి ఈ వివాదం.?
భారత్-బంగ్లా మధ్య చాలా కాలంగా పరిష్కారం కాని నీటి పంపిణీ సమస్యలో తీస్తా వివాదం ఒకటి. 1996 గంగా జలాల ఒప్పందం ప్రకారం, వేసవి కాలంలో ఫరక్కా బ్యారేజ్ వద్ద నీటిని పంచుకోవాలని నిబంధన ఉంది. అయితే, వేసవి నెలల్లో తమకు తగినంత నీరు అందుబాటులో లేదని, దీనివల్ల దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయం, జీవనోపాధి దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది. వాతావరణ మార్పులు కూడా ఈ నీటి కొరత వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
1996 ఒప్పందం ఈ సంవత్సరంతో ముగియనున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ తీస్తా జలాల్లో “సమాన వాటా” కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే, పశ్చిమ బెంగాల్ తన సొంత అవసరాలను పేర్కొంటూ దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది. 2011లో ప్రధాన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సమయంలో బంగ్లాదేశ్ 37.5 శాతం, భారత్ 42.5 శాతం నీటిని వాడుకోవాలని ఒక ప్రతిపాదన చేశారు. అయితే, ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగాల్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది.
54 నదులు, రెండు ఒప్పందాలు:
బంగ్లాదేశ్, భారత్ మధ్య ఏకంగా 54 ప్రవహిస్తున్నాయి. అయితే, రెండు దేశాల మధ్య కేవలం రెండు ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్‌కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం నీటిని కేటాయించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, 2015లో ప్రధాని మోడీ బంగ్లా పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని అనుకున్నప్పటికీ, రాలేదు. భారత్, బంగ్లా మధ్య గంగా జలాల ఒప్పందం, కుషియారా నదీ ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. తీస్తా, ఫెనీ నదులు సహా అనేక నదుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!