Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఉఖ్రుల్ జిల్లాలోని నుంగ్‌షాంగ్ ఖోంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 40 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి.
దాడిని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఖండించారు. ఇలాంటి దాడులు శాంతిభద్రతలను కాపాడాలనే ప్రభుత్వం సంకల్పాన్ని బలహీనపరచలేవని అన్నారు. బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని హోం మంత్రి గోవిందాస్ కొంథౌజమ్ అన్నారు. మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో కొత్తగా అస్సాం రైఫిల్స్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆదివారం నిరసనకారులు, భద్రతా సిబ్బందిపై ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు పౌరులు గాయపడ్డారు.
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
మే 2023లో మైతేయ్, కుకీ జో వర్గాల మధ్య జాతి హింసతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. భద్రతా బలగాలు ఆ రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ జాతి ఘర్షణల్లో ఇప్పటి వరకు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!