Bengaluru: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ కు చెందిన టీనేజ్ యువతి బెంగళూర్ లో పట్టుబడింది. 19 ఏళ్ల పాకిస్తాన్ కు చెందిన యువతిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రా జీవని అనే యువతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్(25) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు బెంగళూర్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ములాయం సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.