Diwali Surprise: ఉద్యోగులకు దీపావళి కానుకగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్.. టీ ఎస్టేట్ ఓనర్ సర్ప్రైజ్ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Surprise: దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రతీ కంపెనీ కూడా తన ఉద్యోగులకు బోనస్‌లు, గిఫ్టులు, స్వీట్లు అందచేస్తు్న్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు మరిచిపోలేని కానుకలను ఇస్తోంది. కార్లు, బైకులను అందించి సర్ప్రైజ్ చేస్తున్నాయి. హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీల తన ఉద్యోగులకు కార్లను అందించింది.
ఇదిలా ఉంటే తమిళనాడులోని టీ ఎస్టేట్ కంపెనీ తన ఉద్యోగులకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అందించింది. తమ యజమాని అందించిన గిఫ్టుతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీలగిరి జిల్లాలోని కోటగిరి పట్టణంలోని టీ ఎస్టేట్ తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
Also Read
- CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్‌లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
Read Also: NZ vs PAK: న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. రద్దైతే ఆ జట్టుకే గెలుపు అవకాశం..!
ఉద్యోగులకు బైక్ కీలు అందిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది. 42 ఏళ్ల టీ ఎస్టేట్ ఓనర్ శివకుమార్ కూడా తన ఉద్యోగులతో కొత్త బైకులపై జాయ్ రైడ్‌కి వెళ్లారు. దీనిపై ఉద్యోగులు మాట్లాడుతూ.. తాము ఇలాంటి గిఫ్టులను ఎప్పుడూ ఆశించలేదని, మా యజమాని 15 రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్ని కానుకగా ఇచ్చారని, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు.
దీనికి ముందు హర్యానా పంచకులలోని మిట్స్‌కార్ట్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ చైర్మన్ ఎంకే భాటియా 12 మంది ఉద్యోగులకు టాటా పంచ్ కార్లను బహూకరించారు. ఇందులో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నారు. తన ఉద్యోగుల అంకితభావం, కృషికి తాను గిఫ్టులు ఇవ్వాలని అనుకున్నానని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
-
Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం…!
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..