మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదం సద్దుమనగడం లేదు. సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు ఇప్పటికే ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలతీసి పంపించారు. ఈ ఘటనకు ముందు మహరాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని చంపారు. ఈ రెండు ఘటనలు దేశంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ రెండు ఘటనలపై ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ జరుగుపతోంది.
తాజాగా నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన చాలా మందికి చంపేస్తామనే బెదిరింపులు ఎదురవుతున్నాయి. గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను కూడా చంపేస్తామని కొంత మంది బెదిరించారు. నుపుర్ శర్మ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినందుకు ముగ్గురు వ్యక్తులు వ్యాపారవేత్తను హత్య చేస్తామని బెదిరించారు. నుపుర్ శర్మ ఫోటో అప్ లోడ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏడుగురి నుంచి బెదిరింపులు వచ్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మహ్మద్ అటాష్ బాజీవాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళగా గుర్తించారు. వీరంతా సూరత్ కు చెందిన వారే. మరోవైపు మిగతా నలుగురి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.
Read Also: Katrina Kaif : నేటికీ కవ్విస్తూనే ఉన్న కత్రినా!
అరెస్ట్ అయిన ముగ్గురిపై ఐపీసీ సెక్షన్లు 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో అవమానించడం), 506, 507 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు. దీంతో నుపుర్ శర్మ వివాదం అనంతరం పలువురు మతపెద్దలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టిన తర్వాత వెంటనే తొలగించి, క్షమాపణలు చెప్పాడు సదురు వ్యాపారవేత్త అయినా కూడా నిందితులు అతన్ని హత్య చేస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరించారు. సూరత్ లో ఉండాలనుకుంటున్నా..? లేదా.? అని భయపెట్టారు.