Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సెప్టెంబర్ నెలలో ఈ వివాదంపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.