Supreme Court: “హైకోర్టు తప్పు చేసింది”.. యాక్టర్ దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు..
- యాక్టర్ దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- గతేడాది రేణుకాస్వామి హత్య కేసుపై విచారణ..
- బెయిల్ ఇచ్చినందుకు కర్ణాటక హైకోర్టుపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘ప్రాథమిక దృష్టితో కూడిన న్యాయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం’’ అని విమర్శించింది. దర్శన్ తూగదీపకు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టును సుప్రీంకోర్టు మందలించింది. బెయిల్ మంజూరు చేయడంలో విచక్షణ ఉపయోగించడంలో విఫలమైందని గత వారం హైకోర్టుకు చెప్పింది.
Also Read
Read Also: HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
గురువారం మధ్యాహ్నం జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు చేసిన తప్పును తాము చేయబోమని చెప్పింది. హత్య కుట్ర కేసు కాబట్టి మేము దీనిపై కొంచెం తీవ్రంగా ఉన్నామని చెప్పింది. హైకోర్టు డిసెంబర్ 2024 బెయిల్ ఆర్డర్‌లోని భాషపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో సహా మొత్తం 13 మంది నిందితులు ఉన్నారు. దర్శన్ స్నేహితురాలు పవిత్రగౌడకకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడనే ఆరోపణలతో రేణుకాస్వామి హత్య జరిగింది. రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న మురుగునీటి కాలువలో కనుగొన్నారు. రేణుకాస్వామి కిడ్నాప్‌లో పాల్గొన్న నలుగురికి దర్శన్ రూ. 50 లక్షలు ఇచ్చాడని పోలీసులు భావిస్తున్నారు. అపహరణ, హత్యకు సంబంధించిన అన్ని అంశాలను నిర్వహించడానికి, అలాగే మృతదేహాన్ని పారవేయడానికి ప్రదోష్ (అలియాస్ పవన్) అనే వ్యక్తికి రూ. 30 లక్షలు ఇందులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. హత్య , మృతదేహాన్ని పడవేయడంలో సాయం చేసిన నిఖిల్, కేశవమూర్తికి రూ. 5 లక్షలు చొప్పున ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?