Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
- మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన
- గవర్నర్, సీఎంతో భేటీ!
- చారిత్రక కాంగ్లా కోట సందర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మణిపూర్‌లో పర్యటించారు. శుక్రవారం ఇంఫాల్‌లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
చారిత్రక కాంగ్లా కోట సందర్శన
అంతకుముందు సెర్జియో గోర్ మణిపూర్‌లోని చారిత్రక కాంగ్లా కోటను సందర్శించారు. ఒకప్పుడు మణిపూర్ రాజ్యానికి రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. అలాగే మహిళలు నిర్వహించే ప్రముఖ మార్కెట్ ‘ఖ్వైరంబండ్ ఈమా కైథెల్’ను కూడా సందర్శించారు. మణిపూర్ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ప్రాంతాలను గోర్ సందర్శించినట్లు తెలుస్తోంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోనే అమెరికా రాయబారి రాత్రి బస చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
- Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
అంతకుముందు డార్జిలింగ్‌లో పర్యటన
మణిపూర్ పర్యటనకు ఒక రోజు ముందు సెర్జియో గోర్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పర్యటించారు. రాజ్యసభ ఎంపీ, మాజీ విదేశాంగ కార్యదర్శి, అమెరికాలో భారత మాజీ రాయబారి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా వ్యక్తిగత ఆహ్వానం మేరకు డార్జిలింగ్ వెళ్లారు. డార్జిలింగ్ పర్యటనపై సెర్జియో గోర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భారత్‌కు వచ్చిన తొలినాళ్లలో తనను ఆప్యాయంగా స్వాగతించిన వారిలో హర్ష్ వర్ధన్ శ్రింగ్లా ఒకరని తెలిపారు. తన స్వస్థలం, నియోజకవర్గమైన డార్జిలింగ్‌ను సందర్శించాలని శ్రింగ్లా ఆహ్వానించారని, ఆ అవకాశం ఇప్పుడు లభించిందని చెప్పారు. డార్జిలింగ్ ప్రజల ఆతిథ్యం, అక్కడి చరిత్ర, ప్రకృతి అందాలు, ఆహారం తనను ఆకట్టుకున్నాయని గోర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరోసారి డార్జిలింగ్‌కు వస్తానని తెలిపారు.
మకైబారి టీ ఎస్టేట్‌లో ప్రత్యేక అనుభవం
డార్జిలింగ్‌లోని ప్రసిద్ధ టీ తోటల్లో ఒకటైన చారిత్రక మకైబారి టీ ఎస్టేట్‌ను కూడా సెర్జియో గోర్ సందర్శించారు. అక్కడి పచ్చని తేయాకు తోటలను వీక్షిస్తూ, ప్రపంచ ప్రసిద్ధ డార్జిలింగ్ టీని ఆస్వాదించారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే తన పర్యటనలో భాగంగానే డార్జిలింగ్, మణిపూర్‌లను గోర్ సందర్శించినట్లు తెలుస్తోంది.


తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!