Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది.