Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్”…
Minister Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కాకుండా పీడీ యాక్ట్ పెట్టాలని చట్టం తెచ్చామన్నారు. వినియోగదారుడికి కొన్ని హక్కులు ఉన్నాయని.. వినియోగదారుడికి వ్యాపారులు కొన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అమ్మకందారులు కూడా బాధ్యతగా ఉండాలంటే చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కుబడిగా అవగాహన కార్యక్రమం చేయటం కాకుండా…