NCP Crisis: పవార్ మరణం తర్వాత ‘‘పవర్’’ పాలిటిక్స్.. డిప్యూటీ సీఏంగా సునేత్ర పవార్..!
- అజిత్ పవార్ మరణం తర్వాత రాజకీయాలు..
- ఎన్సీపీలో నాయకత్వం సమస్యలు..
- అందరి చూపు సునేత్రా పవార్ వైపే..
- డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ‘‘పవర్ గేమ్’’ మొదలైంది. ఎన్సీపీకి తదుపరి అధినేత ఎవరనే ప్రశ్న ఉత్పత్నమవుతోంది. మరోవైపు, అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం కలిసిపోతాయనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి కోసం పార్టీ నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
- రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
- Public Examinations Act Amendment Bill 2026: లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
- Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సీనియర్ ఎన్సీపీ నేత, మహారాస్ట్ర ఎఫ్‌డీఏ మంత్రి నర్హరి జిర్వాల్ గురువారం మాట్లాడుతూ.. సునేత్ర పవార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్, ధనంజయ్ ముండే, సునీల్ తట్కరేలు సునేత్ర పవార్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం నుంచి సునేత్రా పవార్‌ను పోటీలో దింపాలని ఎన్సీపీ భావిస్తోంది.
ఇక పార్టీ కార్యక్రమాలనున నడిపించడానికి ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ముందుంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే విధంగా శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల, ఈ రెండు కూటములు కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాయి. అజిత్ పవార్ ఎన్సీపీ రాష్ట్రంలో బీజేపీ-శివసేనతో కలిసి మహాయుతి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం సునేత్రా పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
Bihar Bandh AK-47 Firing: విద్యార్థుల నిరసనలో.. ఏకే-47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ సస్పెండ్..
ట్రెండింగ్
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!