Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamaha R15M May Be Discontinued: యమహా బైక్స్ అంటే స్పోర్ట్స్ ప్రేమికులకు గుర్తొచ్చే పేరు ‘R15’. మనదేశంలో ఈ సిరీస్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. అయితే, త్వరలోనే R15 లవర్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. మార్కెట్లోకి కొత్తగా యమహా R2 అడుగుపెట్టిన తర్వాత, కంపెనీ తన బైక్స్ మోడల్స్ లైనప్‌లో కొన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోందట. ఇందులో భాగంగానే యమహా R15M బైక్‌ను పూర్తిగా నిలిపివేసే (డైరెక్ట్‌గా ఆపేసే) ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. R15M మోడల్ నిజానికి ప్రస్తుతం ఆర్15 V4, అలాగే కొత్తగా వచ్చిన R2 మోడళ్ల మధ్యలో ఉంటుంది. ఒకవేళ R15M బైక్‌ను పక్కన పెడితే, ఆర్15 V4 మోడల్ కి, కొత్త R2 కి మధ్య ఒక పెద్ద గ్యాప్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ విషయంపై యమహా నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
అసలు ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే…?
R15M మోడల్ కూడా సాధారణ 155 సీసీ ఇంజిన్‌తోనే వస్తుంది. కాకపోతే ఆర్15 V4 తో పోలిస్తే ఇందులో కొన్ని ఎక్కువ ఫీచర్లు, ప్రీమియం ఫినిషింగ్ ఇచ్చారు. ఒకవేళ కంపెనీ ఈ బైక్‌ను డిస్కంటిన్యూ చేస్తే, ఆర్ సిరీస్ కస్టమర్లకు చాలా సింపుల్‌గా, క్లియర్‌గా అర్థమవుతుంది. తక్కువ బడ్జెట్లో స్పోర్టి ఫీల్ కావాలనుకునే వారికి ఆర్15 V4 ఒక మంచి ఆప్షన్‌గా ఉంటుంది. అదే కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్, ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారు నేరుగా నెక్స్ట్ లెవెల్ బైక్ అయిన R2కి షిఫ్ట్ అయిపోవచ్చు.
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
ధరల వ్యత్యాసం ఎలా ఉందంటే…
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా బైక్స్ ధరలు చూస్తే:
R15S: రూ.1.59 లక్షలు
R15 V4: రూ.1.75 లక్షల నుంచి రూ.1.79 లక్షలు
R15M: రూ.1.90 లక్షల నుంచి రూ.2.00 లక్షలు
R2 (ఇటీవలే లాంచ్ అయింది): రూ.2.30 లక్షల నుంచి రూ.2.40 లక్షలు
R2M: రూ.2.53 లక్షలు
ఒకవేళ కంపెనీ ఆర్15M బైక్‌ను సేల్స్ నుంచి తీసేస్తే, R15 సిరీస్‌కి, R2 సిరీస్‌కి మధ్య ధరల తేడా ప్రసుతం ఉన్న రూ.30 వేల నుంచి ఒక్కసారిగా రూ.51 వేలకు పెరుగుతుంది. ఇకపోతే, ఇటీవల ఆగస్టు నెలలో ఆర్15 సిరీస్ బైక్స్ మొత్తం కలిపి 7,691 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్15 సిరీస్‌కి ఇదే అతితక్కువ సేల్స్ కావడం గమనార్హం. అందుకే కంపెనీ తన లైనప్‌ను రీ-పొజిషన్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!