Sugar prices: ఇండియాలో చక్కెర ధరలు పెరగనున్నాయా..? అయితే పరిణామాలు చూస్తే మాత్రం రానున్న రోజుల్లో చక్కెర ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. 2023-24 క్రాప్ ఇయర్ లో చక్కెర ఉత్పత్తి 14 శాతం తగ్గింది. చక్కెర ఉత్పత్తితో తగ్గింపు ఆహార ద్రవ్యోల్భణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉంది.