Congress: ముంబైని “యూటీ” చేయాలనుకుంటుంది.. అందుకే పార్లమెంట్ సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘కేంద్రపాలిత ప్రాంతం’ చేయాలనుకుంటోందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎజెండా ఇదేనని మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సోమవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ మహమ్మారి, నోట్ల రద్దు, మణిపూర్ అంశాలపై ఎప్పుడూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయలేదని, కానీ ప్రస్తుతం రాబోతున్న సమావేశాల్లో ముంబైని యూటీ ప్రాంతంగా ప్రకటించి మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల నుంచి విడదీస్తుందని ఆరోపించారు.
Read Also: Karnataka: దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి..
Also Read
- PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
ముంబై ఒక అంతర్జాతీయ నగరం, ఆర్థిక రాజధాని అని.. ఇప్పుడు ముంబైలోని ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, డైమండ్ మార్కెట్ వంటి వాటిని నగరం నుంచి తరలించేస్తున్నారని పటోలే ఆరోపించారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లను గుజరాత్‌కి మార్చే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో శివసేస-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలకు అడ్డంకిగా ఉందనే కేంద్రంలోని బీజేపీ అధికారంలోంచి దించేసిందని ఆయన అన్నారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. అయితే సమావేశాల ఎజెండా ఇంతవరకు కేంద్రం స్పష్టం చేయలేదు. అయితే ఇండియా-భారత్ పేరు మార్పు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు చర్చకు వస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 19 తేదీన కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!