కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కుబేర ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి.
Also Read : Keerthi Suresh : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్న శైలజ
రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు సేల్ అయ్యాయి. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలకు గాను రూ. 33కోట్లకు విక్రయించారు. అటు తమిళనాడు – రూ .18 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ .50కోట్లు ఓవర్శిస్ – రూ . 8.50 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ గా రూ. 65 కోట్లకు రైట్స్ సేల్ చేసారు. మొత్తంగా చూసుకుంటేరూ. 130 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమాకు బజ్ ఆశించంత లేదనే చెప్పాలి. కాకుంటే శేఖర్ కమ్ముల సినిమాలు రిలీజ్ కు ముందు అంతగా హడవిడి ఏమి ఉండవు. రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తో సినిమా మరింతగా ఆడియెన్స్ లోకి వెళుతుందని టీమ్ బలంగా నమ్ముతోంది. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి అడుగుపెడుతున్న కుబేర మొదటి రోజు ఏ మేరకు రాబడతాడో హిట్ టాక్ వస్తే ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. పోటీలో మారె ఇతర సినిమాలు లేకపోవడం కుబేరకు కలిసొచ్చే అంశం.