Nirmala Sitharaman: గత మూడేళ్లలో రూ.6 లక్షల కోట్ల రుణాలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన మూడేళ్లలో దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసి మొండి బకాయిలు(NPA)గా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్బీఐనే రూ.1,64,735 కోట్ల రుణాలు రద్దు చేసిందని చెప్పారు. ఈ జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.61,763 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.59,807 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.52,655 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.37,617 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.34,281 కోట్లు, ఐడీబీఐ రూ.32,586 కోట్లు, యూకో బ్యాంక్ రూ.30,160 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.22,522 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.21,772 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.18,874 కోట్ల రుణాలను రద్దు చేశాయి.
ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రుణాలన్నీ రద్దు చేసి వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత ఎన్పీఏలను రద్దు చేసి బ్యాలెన్స్ షీట్ల నుంచి తొలగిస్తారని ఆమె వివరించారు. అయితే సివిల్ కోర్టులు, రుణ రికవరీ ట్రిబ్యునళ్ల ద్వారా, చట్టపరమైన చర్యల ద్వారా నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన రునాలను వసూలు చేసుకునే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
Read Also: Jairam Ramesh: మోడీ తన ప్రతిష్ట కోసం.. దేశాన్నే ప్రమాదంలో పడేశారు
కాగా పేద ప్రజల రుణాలను రద్దు చేయకుండా బడా కంపెనీల రుణాలనే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. రుణాల మాఫీ పేరుతో పేద ప్రజల డబ్బులను ప్రభుత్వ బ్యాంకులు లూటీ చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు. కాగా రైట్ ఆఫ్ చేసే రుణాల వివరాలను ప్రతి త్రైమాసికంలోనూ బ్యాంకులు ప్రజలకు వెల్లడిస్తుంటాయి. ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్లలో నమోదైన బ్యాంకులు ప్రతి త్రైమాసికంలో తమ ఫలితాలను వెల్లడించేటప్పుడు ఈ వివరాలకు కూడా బయటపెడతాయి. ఈ ఫలితాల్లో ఎంత మొత్తం రుణాలను మాఫీ చేశారో తమ షేర్హోల్డర్స్కు తప్పనిసరిగా బ్యాంకులు వెల్లడించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!