కేంద్ర బడ్జెట్ అంటేనే అందరికీ గంపెడాశలుంటాయి. పైగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల జాతర జరగబోతుంది. దీంతో బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా వరాలు ప్రకటించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మోడీ సర్కార్ మరోసారి వచ్చేందుకు బడ్జెట్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగులైతే ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరీ నిర్మలాసీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎదురుచూస్తు్న్నారు.
GST: చక్కెర రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. మెలాసిస్‌పై పన్నులను 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య వల్ల చెరుకు రైతులకు మేలు జరుగుతుంది. పశువుల దాణా ధర కూడా తగ్గుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మనుషులు వినియోగించే మద్యాన్ని కూడా లెవీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన మూడేళ్లలో దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసి మొండి బకాయిలు(NPA)గా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్‌బీఐనే రూ.1,64,735 కోట్ల…