Lavanya Says She Loves Raj Tarun Although He has Affairs With Heroines: రాజ్ తరుణ్ మీద గతంలో లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమెకు అనుకూలంగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. ఈ సమయంలో మీరు గతంలో రాజ్ తరుణ్ కి పలువురు హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని మీడియా ముందే కామెంట్ చేశారు అవి నిజమేనా అని అడిగితే అవును నిజమేనని లావణ్య చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ మాత్రం వాళ్లు తన సహ నటులు మాత్రమే అని చెబుతున్నారు దీనికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా అని అడిగితే ఖచ్చితంగా అతనికి అఫైర్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ అతనిని వదులుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము కానీ కలిసి ఉంటామని అనుకునేదాన్ని. ఆయనకు లవర్ సినిమా హీరోయిన్ రిద్దీ, అరియనా, శాలిని పాండే సహా ఇంకో ఇద్దరితో అఫైర్స్ ఉన్నాయని ఆమె అన్నారు. అయితే ఆయనతో చేసిన హీరోయిన్ అందరి పేర్లు మీరు చెబుతున్నారు కదా అని అడిగితే అతను దగ్గర దగ్గర 30 సినిమాలు దాకా చేశాడు.
Nithiin: నితిన్ ఇంట ఆనంద హేల.. వారసుడొచ్చేశాడోచ్!
హెబ్బా పటేల్ పేరు చెప్పానా, అవికా గోర్ పేరు చెప్పానా భలే ఉన్నాడే సినిమా హీరోయిన్ పేరు చెప్పానా? లేక పురుషోత్తముడు సినిమా హీరోయిన్ పేరు చెప్పానా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడిగితే నా దగ్గర ఉన్న ఆధారాలను మీడియాకి కూడా ఇచ్చాను అని అన్నారు. మాల్వి మల్హోత్రాతో కూడా అతను క్లోజ్ గా లేడు అన్నారు కానీ వాళ్ళిద్దరి చాట్ హిస్టరీలు, ట్రావెల్ హిస్టరీ అన్ని బయట పెట్టాను అని అన్నారు.. మాల్వి మల్హోత్రా వీడియోలు బయటపెట్టారు కానీ మిగతా వాళ్ళతో ఉన్న వీడియోలు కానీ చాట్ కానీ బయట పెట్టలేదు కదా అని అడిగితే పెట్టానండి డెఫినెట్గా ఉన్నాయి అని ఆమె అన్నారు.
రాజ్ తరుణ్ కి హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని తెలిసి కూడా ఆయన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు ఆయన కోసం ఇంకా తాపత్రయపడుతున్నారు అంటే ఏం చెబుతారు అని అడిగితే నేను అతనిని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను అతను అంటే నాకు ఇష్టం, ప్రాణం అని ఆమె అన్నారు.. అంత ప్రాణం అనుకున్నప్పుడు ఈ విషయాన్ని కూర్చుని మాట్లాడుకుని ఉండొచ్చు కదా ఇంత దాకా రావాల్సిన అవసరం ఏమి వచ్చింది అనే వాదన వినిపిస్తోంది దీనికి సంబంధించి మీరు ఏమన్నా అంటారా అంటే నేను మొదట్లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టలేదు. మాల్వీ మల్హోత్రా నన్ను జైలుకు పంపుతానని పోయిన సెప్టెంబర్ నెలలోనే చెప్పింది. జనవరి నెలలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే తర్వాత నన్ను చంపేస్తానని బెదిరించారు నన్ను చంపేస్తారేమో అనే భయంతోనే నేను బయటికి వచ్చి కేసు పెట్టాను అని అన్నారు.