Sikh secessionist group to defend man who shot dead Shiv Sena leader in Amritsar: పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో శివసేన నాయకుడిని కాల్చిచంపడం ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ నిందితుడికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి మరో వివాదాన్ని రాజేసింది. శివసేన నాయకుడు సుధీర్ సూరిని కాల్చి చంపిన వ్యక్తిని రక్షించేందుకు వేర్పాటువాద సంస్థ, ఖలిస్తాన్ మద్దతుదారు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) రూ.10 లక్షల న్యాయసహాయాన్ని ప్రకటించింది. శివసేన నేత సూరి హత్య ‘‘ ఉగ్రవాదం’’ కాదని ఎస్ఎఫ్‌జే పేర్కొంది.
Read Also: BJP Manifesto: అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తాం.. వక్ఫ్ భూములపై విచారణ
శుక్రవారం అమృత్ సర్ లో రద్దీగా ఉండే మజితా రోడ్‌లోని గోపాల్ మందిర్ వద్ద హిందూ విగ్రహాలను చిత్రాలను ధ్వంసం చేశారని సుధీర్ సూరి నిరసన తెలుపుతున్న సందర్భంలో సందీప్ సింగ్(31) అనే వ్యక్తి కాల్చి చంపాడు. ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు నిందితుడు. తీవ్రగాయాలైన సూరిని ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ ఘటనలో సందీప్ సింగ్ అలిమాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేసి గన్ స్వాధీనం చేసుకున్నారు. సూరిని బుల్లెట్లు దించి చంపేసిన సందీప్ భాయ్ కి ఎస్ఎఫ్‌జే మద్దతు నిలుస్తుందని దాని జనరల్ కౌన్సిల్ వీడియో విడుదల చేసింది.
ఈ ఘటనపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1980 నాటి పరిస్థితులు పంజాబ్ లో నెలకొన్నాయని అన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను కంట్రోల్ చేయలేకపోతోందని విమర్శించారు. ఘటన జరిగిన 24 గంటల వరకు ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పంజాబ్ లో జాతి వ్యతిరేక శక్తుల పేట్రేగిపోవడానికి ఆప్ ప్రభుత్వం కారణమని విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై శివసేన నాయకులు ఆందోళనకు పిలునిచ్చారు.