NTV Telugu Site icon

Punjab CM: రైతులను ఢిల్లీకి కాకపోతే.. లాహోర్కు పంపాలా ఏంటి..?

Cm Mann

Cm Mann

Punjab CM: పంజాబ్‌ సీఎం, ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హర్యానాలో జరిగిన బహిరంగ సభలో మాన్‌ మాట్లాడుతూ.. శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తున్న రైతులను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోకి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతృత్వంలోని పంజాబ్‌ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.

Read Also: Niti Ayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం.. కారణం ఏమిటంటే..?

అయితే, కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలనే తమ డిమాండ్లను ఆమోదించాలని రైతు సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (MSP) కోసం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. హస్తినకు వెళ్తున్న రైతు సంఘాల నేతలను అంబాలా- న్యూఢిల్లీ జాతీయ రహదారిపై సిమెంటు దిమ్మెలతో సహా బారికేడ్లను ఏర్పాటు చేసిన హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటి నుంచి రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల దగ్గర నిరసన తెలియజేస్తున్నారు.