రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.
Tractor March: రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతు సంఘాలు ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు నుంచి పలు కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి.