పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం.. అదే ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో ప్లస్–2 చదువుతున్న విద్యార్థిని లైంగికంగా వేధించేవాడని సమాచారం.