Sangareddy: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న స్టూడెంట్స్ ను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు యాజమాన్యం. దీంతో ఆప్రాంతం అంతా రోదనలతో మిన్నంటాయి. కడుపు పట్టుకుని ఏడుస్తూ పిల్లలు కనిపించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరగుతున్నా యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆ వార్త కూడా కుటుంబ సభ్యులకు సమాచారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read also: Kethika Sharma : బ్రో సినిమా ద్వారా మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసాను..
గురుకుల పాఠశాల యాజమాన్యంపై నమ్మకంతో తమ పిల్లలను అక్కడ వదిలి వెళితే నాణ్యమైన భోజనం పెట్టకుండా పిల్లలను ఆసుపత్రి పాలు చేశారని కన్నీరు పెట్టుకున్నారు. యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు. పిల్లలు కడుపు నొప్పితో ఏడుస్తూ జీవచ్ఛవంగా పడివున్నారని మనస్సు చలించిపోతుందని కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలు అస్వస్థతకు గురైనా సరైన సమాచారం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం నిర్లక్ష్యం వీడి పిల్లలకు సరైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవిషయమై పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లలకు సరైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..డైట్ లో వీటిని చేర్చాలి..