Shashi Tharoor: 850 మంది ఎంపీలతో లోక్‌సభ నడుస్తుందా?.. చప్పట్లు కొట్టడానికే చాలామంది వస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను భారీగా పెంచడం వల్ల పార్లమెంట్లో చర్చలు, ప్రజా సమస్యలపై ప్రస్తావనలకు అవకాశం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. 815 మంది రాష్ట్రాల నుంచి, మరో 35 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కలిపి మొత్తం 850 మంది సభ్యులతో లోక్‌సభ ఏర్పాటైతే.. చాలామంది కేవలం చప్పట్లు కొట్టడానికే వస్తారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న థరూర్.. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుపై మీడియాతో మాట్లాడారు. ఈ ప్రతిపాదన దేశ సంక్షేమం కోసం చేస్తున్నదా? లేక రాజకీయ ప్రయోజనాల కోసమా? అని ప్రశ్నించారు.
850 మంది ఎంపీలతో సభ నిర్వహణ సాధ్యమేనా?
ప్రస్తుతం 543 మంది సభ్యులతో ఉన్న లోక్‌సభలోనే కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా ఉందని థరూర్ పేర్కొన్నారు. “ప్రభుత్వ ఆలోచన ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇది స్వల్పకాలిక ఆలోచనా? రాజకీయ ప్రయోజనాల కోసమా? లేక దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారా? దేశ సంక్షేమం కోసం 815 మంది ఎంపీలతో లోక్‌సభ పనిచేస్తుందా? ప్రజలకు మాట్లాడే అవకాశం లభిస్తుందా? చర్చలు జరుగుతాయా? ప్రస్తుతం 540 మంది ఎంపీలతోనే సభను నిర్వహించడం చాలా కష్టంగా ఉంది” అని అన్నారు.
Also Read
- MK Stalin: "రాజీపడే ప్రసక్తే లేదు".. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
- Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్‌పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
- Bihar Train Scare: రైలులో మంటలు అంటూ పుకార్లు.. భయంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై రంగంలోకి ఖర్గే, రాహుల్, సోనియా.. స్టాలిన్, శరద్ పవార్‌తో భేటీలు..
ప్రశ్నలు అడిగే అవకాశం తగ్గిపోతుంది
పార్లమెంట్లో ప్రజాప్రతినిధులకు ఇప్పటికే తగినంత సమయం దొరకడం లేదని థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రజలకు మంత్రులను ప్రశ్నించే అవకాశం రావడం లేదు. తమ నియోజకవర్గ సమస్యలను చర్చించడానికి, జీరో అవర్‌లో మాట్లాడడానికి కూడా అవకాశం లభించడం లేదు. 815 మంది సభ్యులు ఉంటే, చాలామంది కేవలం చప్పట్లు కొట్టడానికే వస్తారు” అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, జవాబుదారీతనాన్ని నిర్ధారించే సంస్థగా పార్లమెంట్ పనిచేయాలని అన్నారు. అయితే సభ్యుల సంఖ్యను ఈ స్థాయిలో పెంచితే ఆ లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడ్డారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే నియోజకవర్గాల పునర్విభజనా?
నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతి నియోజకవర్గంలో రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండేలా సరిహద్దులు గీయాలని ప్రభుత్వం భావిస్తోందా? అని థరూర్ ప్రశ్నించారు. “ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీకి ప్రయోజనం కలిగేలా సరిహద్దులను గీయాలనుకుంటున్నారా? మీ ఆలోచన వచ్చే ఎన్నికల వరకే పరిమితమై, దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే, మీరు నిజంగా భారతదేశ సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారా? లేక వచ్చే రెండు నుంచి ఐదేళ్లలో మీ పార్టీ ప్రయోజనాల గురించే ఆలోచిస్తున్నారా?” అని ప్రశ్నించారు.
లోక్‌సభ సీట్లను 850కి పెంచే ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం ఈ ప్రతిపాదనలో భాగంగా ఉంది.
2026 రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు ప్రకారం
లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 543 నుంచి 850కి పెరగనుంది.
రాష్ట్రాల నుంచి గరిష్ఠంగా 815 మంది సభ్యులు ఉండవచ్చు.
కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉండవచ్చు.
రాష్ట్ర శాసనసభల గరిష్ఠ సభ్యుల సంఖ్యను 500 నుంచి 650కి పెంచే ప్రతిపాదన ఉంది.
పెంచిన స్థానాలు, నియోజకవర్గాల సరిహద్దులను 2051 వరకు స్థిరంగా ఉంచాలని ప్రతిపాదించారు.
బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలు
ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించేందుకు కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సంఖ్యాబలం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇండియా కూటమి నేతల బృందం డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్‌లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందా?
కేంద్రం తీసుకురానున్న బిల్లు వల్ల షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు శాశ్వతంగా అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకునేందుకు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచేందుకు ఈ చర్యలు చేపడుతున్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ అమలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక చర్చకు దారితీయనున్నాయి.
Jamshedpur, Jharkhand: On the Delimitation Bill, Congress MP Shashi Tharoor says, "I am unable to understand the government’s thinking on this issue. Is this short-term thinking? Are they doing this with their political ambitions in mind, rather than thinking about the welfare of the country?…Will a Lok Sabha with 815 MPs actually function effectively? …"
— IANS (@ians_india) November 28, 2026
తాజావార్తలు
-
Shashi Tharoor: 850 మంది ఎంపీలతో లోక్‌సభ నడుస్తుందా?.. చప్పట్లు కొట్టడానికే చాలామంది వస్తారు..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
-
AP Panchayat Elections 2026: రెండో దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. నకిలీ బ్యాలెట్ పేపర్లు, రాళ్ల దాడులు!
-
MK Stalin: “రాజీపడే ప్రసక్తే లేదు”.. రాహుల్ గాంధీ చెన్నై పర్యటనకు ముందు స్టాలిన్ కీలక సందేశం..
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!