Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- రాహుల్ గాంధీపై శర్మిష్ఠా ముఖర్జీ ఘాటు విమర్శలు.
- "రాజకీయం 24 గంటల బాధ్యత" అని వ్యాఖ్య.
- కాంగ్రెస్ వరుస ఓటములకు రాహుల్ నాయకత్వమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharmistha Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాలంటే కొద్ది రోజులు ప్రజల్లో ఉంటూ, మళ్లీ మాయమయ్యే వ్యవహారం కాదని, రాజకీయం 24 గంటలు, ఏడాది పొడవునా కొనసాగే ఫుట్ టైమ్ బాధ్యత అని ఆమె అన్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేవారు. 2014లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతగా ఉన్నప్పటి నుంచి పార్టీ వరసగా ఎన్నికల్లో ఓటములు చవిచూస్తోందని, ఇది ఆయన నాయకత్వ వైఫల్యంగా భావించాల్సిందే అని పేర్కొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల ముందు భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు కొంత మేర ప్రయోజనం చేకూర్చిందని అంగీకరిస్తూనే, కొన్ని కార్యక్రమాల్లో రాహుల్ గాందీ కనిపించి, ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా పోతారని విమర్శించారు. భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవ సమయంలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు..? అని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో రెండు రోజులు ప్రజల్లో తిరిగి, సభలు నిర్వహించి, ఆ తర్వాత కనిపించకుండా పోవడం సరైన విధానం కాదని శర్మిష్టా అన్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 315 భారతీయుల ఆచూకీ గల్లంతు..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
కాంగ్రెస్ పార్టీ పొత్తులపై ఆధారపడుతోందని, సొంతగా సంస్థాగత బలాన్ని పెంచుకోవడంపై ఆలోచించడం లేదని ఆమె ఆరోపించారు. తాను కాంగ్రెస్‌లో పనిచేసిన సమయంలో పార్టీ అంతర్గతంగా బలోపేతం అవ్వడం కన్నా, పొత్తుల ద్వారా గెలవాలనే ఆలోచన ఎక్కువగా కనిపించేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజాదరణ కలిగిన నాయకుడని, ఆయనకు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, అదే స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజామద్దతు తీసుకురావడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని అన్నారు. రాహుల్, ప్రియాంకా గాంధీల నాయకత్వాన్ని పోల్చేందుకు తాను ఇష్టపడటం లేదని శర్మిష్టా చెప్పారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!