Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- పాకిస్తాన్ బాటలో వెళ్తున్న బంగ్లాదేశ్..
- చైనా నుంచి జె-10 యుద్ధ విమానాల కోసం చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్ నడుస్తోంది. చైనా నుంచి 20 J-10CE యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఖరారైతే, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న భారీ రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ తమ దళాన్ని పూర్తిగా ఆధునీకీకరించుకోవడం, వాయుదళ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీని కోసమే చైనా నుంచి ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం సిద్ధమవుతోంది.
ముఖ్యంగా 2025 మేలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ తయారీ జే-10 యుద్ధ విమానాల పనితీరు కూడా బంగ్లాదేశ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ 20 విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందం రూపుదాలిస్తే పాత తరానికి చెందిన యుద్ధ విమానాల స్థానంలో ఆధునిక మల్టీ రోల్ ఫైటర్ జెట్లను ప్రవేశపెట్టినట్టు అవుతుంది.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ తన జె-10 విమానాలు చాలా బాగా లక్ష్యాలను ఛేదించినట్లు చెప్పుకొచ్చాయి. చైనీస్ మీడియా కూడా ఇదే కథనాన్ని ప్రచురించింది. అయితే, పాకిస్తాన్ తన వాదనలకు మాత్రం రుజువులు చూపించలేకపోయింది. భారత యుద్ధ విమానాలను జె-10 టార్గెట్ చేసిందనే వార్తల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే, పాక్ ఈ యుద్ధ విమానాలు ఉపయోగిస్తోంది, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వీటిని కొనుగోలు చేస్తే దక్షిణాసియా దేశాల్లో చైనా ఆయుధ విక్రయాలు విస్తరించినట్లు అవుతుంది.
తాజావార్తలు
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!