Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- చైనా, అమెరికా సాయాన్ని తిరస్కరిస్తున్న నేపాల్..
- భారత సాయానికి ఓకే..
- 2015 భూకంప సమయంలో ఎదురైన అనుభవాలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్‌లో వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భోటెకోశి నది ఉప్పెనలా విరుచుకుపడటంతో చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 500 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సాయం చేస్తామని ప్రపంచదేశాలు ముందుకొస్తున్నా నేపాల్ సాయాన్ని మాత్రం వద్దని చెబుతోంది. చైనా, అమెరికా సహా పలు దేశాల నుంచి నేపాల్ సాయాన్ని తిరస్కరించింది. సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికి సొంత భద్రతా సంస్థలు పూర్తి సామర్థ్యం ఉందని నేపాల్ చెప్పింది.
చైనా, అమెరికా సహా పలు దేశాలు నేపాల్‌కు హెలికాప్టర్లు, సహాయక బృందాన్ని పంపుతామని కోరాయి. అయితే, 2015 భూకంపం తర్వాత తమకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేపాల్ ఈ సాయాన్ని సున్నితంగా తోసిపుచ్చుతోంది. 2015 భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బృందాలు, సైనిక విమానాలు, విదేశీ సహాయ సంస్థల తాకిడితో కాఠ్మాండు విమానాశ్రయం, పరిపాలన వ్యవస్థ కుప్పకూలిపోయింది. విదేశీ బృందాల మధ్య సమన్వయ లోపం, పోటీ సంక్షోభాన్ని తగ్గించకపోగా, మరింత పెంచాయి. దీంతో నేపాల్ ఈ సారి విదేశీ సాయాన్ని తిరస్కరిస్తోంది.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
భారత సాయాన్ని స్వీకరించిన నేపాల్..
అయితే, సహాయక సామాగ్రి, వైద్య సామాగ్రి, ఆర్థిక విరాళాలను తాము స్వీకరిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ భారత్ సహాయాన్ని కోరినట్లు చెప్పింది. భారతదేశం ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని, ఆ తర్వాత భూగర్భ పరిస్థితులను, పరికరాల అవసరాలను అంచనా వేయడానికి ఒక పరిశీలనా బృందాన్ని పంపడానికి సిద్ధమవుతోంది. ఒక వైద్య బృందాన్ని కూడా పంపుతున్నారు.
భారత్ ప్రభుత్వం ఇప్పటికే వైమానిక దళానికి చెందిన సి-130జె మరియు సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల ద్వారా 47.5 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, మందులు, సోలార్ దీపాలు , ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. దెబ్బతిన్న వంతెనల స్థానంలో లోయ వంతెనలు,ప్రీఫ్యాబ్రికేటెడ్ వంతెనలను నిర్మిస్తామని కూడా భారతదేశం ముందుకొచ్చింది. నేపాల్ అభ్యర్థించిన సహాయం మేరకు చర్యలు తీసుకుంటుందని విదేశాంగ ప్రతినిధి రణధీన్ జైస్వాల్ చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు