INDIA Bloc: ఖర్గే, రాహుల్ గాంధీని కలిసిన శరద్ పవార్.. ఇండియా కూటమి నెక్ట్స్ ప్లాన్‌పై ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
ముంబై సమావేశం తర్వాత ఎక్కడ భేటీ కావాలనే విషయాన్ని కూటమి నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కూటమి నేతలు భేటీ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా శరద్ పవార్, ఖర్గే, రాహుల్ గాంధీల మధ్య 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలా ఢీకొట్టాలని నేతలు చర్చించారు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Read Also: Viral News : మెట్రోలో తిన్న ప్రయాణికుడు.. షాక్ ఇచ్చిన అధికారులు..
రాహుల్ గాంధీతో పాటు దేశ ప్రజల గొంతు వినిపించడానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కలిశారని ఖర్గే ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. మేము ప్రతీ సవాల్‌కి సిద్ధంగా ఉన్నాం, జూడేగా భారత్, జీతేగా ఇండియా( భారత్ ఏకమవుతుంది, భారత్ గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.
అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ర్యాలీ నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఇది రద్దైంది. డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి మద్దతుగా పలువురు డీఎంకే నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఈ యాత్రను నిర్వహించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పలువురు ఇండియా కూటమి నేతలు తదుపరి సమావేశాన్ని పశ్చిమ బెంగాల్ లో నిర్వహించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!