Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది
- పెట్టుబడులకు స్వర్గధామం
- భారత్ విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ అన్నారు. ఢిల్లీలో సెర్గియా గోర్ మాట్లాడుతూ.. “ప్రతి వారం కొంతమంది మా ఎంబసీకి వచ్చి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా? అక్కడ భాగస్వామ్య అవకాశాలు ఉన్నాయా?’ అని అడుగుతుంటారు. వారికి మా సమాధానం ‘అవును’ అనే సమాధానం చెబుతుంటా. ప్రపంచంలోని ప్రతి దేశానికి మేము ఈ సమాధానం ఇవ్వం. భారత్‌లో అద్భుతమైన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వాటికి స్వాగతం ఉంది. భారీ టెక్ కంపెనీలకు అనుకూలంగా నిబంధనలను మార్చి.. సరళీకృతం చేసిన ముందుచూపు గల ప్రభుత్వం భారత్‌లో ఉంది. అమెరికాలో ఇప్పటికే విజయవంతమైన టెక్ సంస్థలు ఇప్పుడు భారత్ వంటి విశ్వసనీయ ప్రాంతాల్లో విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి” అని పేర్కొన్నారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్ దాదాపు ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా ముందుగా పరిశీలించిన అంశాల్లో ఒకటి.. ప్రపంచం ఏ దిశగా సాగుతోంది అన్నదే. చాలా కాలంగా ప్రపంచ శక్తి కేంద్రాలు పాతబడ్డ ప్రాంతాలకే పరిమితమైపోయాయి. అయితే ఈ ప్రభుత్వం కొత్త శక్తి కేంద్రాలను గుర్తించే ప్రయత్నం చేసింది. నా దృష్టిలో.. అధ్యక్షుడు ట్రంప్ దృష్టిలో.. అమెరికా ప్రభుత్వ దృష్టిలో.. భారత్ ప్రాధాన్యం ఇప్పుడే ఉంది. అది గతంలో కాదు. పాత ఆలోచనల్లో చిక్కుకుపోలేదు. భారత్‌లో ఉన్న అపార సామర్థ్యాన్ని మేము గుర్తించాం. భారత్ ఆర్థికంగానే కాదు. వ్యూహాత్మకంగానూ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోందని మేము చూస్తున్నాం. అందుకే భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు.
Also Read
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
- El Nino Effect On Stock Market: ఎల్‌నినో ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Karnataka: కర్ణాటకపై రాహుల్‌గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
“ప్రపంచ శక్తి సమీకరణాలను కీలక, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు పూర్తిగా మార్చేస్తున్న ఈ నిర్ణాయక సమయంలో మనం ఉన్నాం. ఈ మార్పుకు నాయకత్వం వహించేందుకు మన రెండు దేశాల భాగస్వామ్యానికి మించిన శక్తివంతమైన సంబంధం మరొకటి లేదని నేను నమ్ముతున్నాను. ఇదే సమయంలో భారత్-అమెరికా సంబంధాలను 21వ శతాబ్దంలోని అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామ్యంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఈ భాగస్వామ్యం మన రెండు దేశాలకు, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించేదిగా ఉండాలి” అని వెల్లడించారు.
#WATCH | Delhi: US Ambassador to India, Sergio Gor says, "…Every week we have individuals who show up to the Embassy and they ask if it is safe to invest in India. Is there somewhere that we can partner with? And our answer to them is 'yes'. It is not an answer we give around… pic.twitter.com/uFWSUnJoaY
— ANI (@ANI) May 29, 2026
#WATCH | Delhi: US Ambassador to India, Sergio Gor says, "When President Trump came into office a year and a half ago, one of the things that the US took an account of is, where is the world heading. For too long, those centres of power, have stayed in places that have become… pic.twitter.com/mmFiMQ9XIR
— ANI (@ANI) May 29, 2026
#WATCH | Delhi: US Ambassador to India, Sergio Gor says, "We are at a defining moment, one where critical and emerging technologies are fundamentally reshaping the global balance of power. I believe that no partnership is better positioned to lead that charge than ours. At the… pic.twitter.com/yaEHVB9Zwc
— ANI (@ANI) May 29, 2026
తాజావార్తలు
-
Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
-
Vaibhav Suryavanshi: వైభవ్‌కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6s Gen 2 చిప్
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
-
Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!