New Delhi: వీర్యం తారుమారులో రూ. 1.50 కోట్ల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే వారిని కదలిస్తే చాలు.. వారి బాధలను చెప్పుకుంటూ పోతూనే ఉంటారు.. అన్ని ఉంటాయి వారి బాధలు. ప్రైవేటు ఆసుపత్రులు చేసే చికిత్స కంటే.. వేసే బిల్లే ఎక్కువగా ఉంటుంది. ఆ బిల్లును చూసిన రోగులకు, రోగి కుటుంబీకులకు కొత్త రోగాలు వస్తున్నాయి. అలాంటిదే న్యూఢిల్లీలో ఒక ఘటన జరిగింది. వీర్యంను తారు మారు చేశారు. దీంతో బాధితులు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో కేసు విచారించిన కమిషన్ వీర్యం తారు మారు చేసిన ప్రైవేటు హాస్సిటల్‌కు ఏకంగా రూ. 1.50 కోట్ల జరిమానా విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి..
Read also: Puvvada Ajay Kumar: పక్క రాష్ట్రాల్లో ఆర్టీసి పరిస్థితి బాగోలేదు..!
Also Read
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించారు. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్‌టీ) విధానంలో సంతానం కోసం దపంతులు ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తరువాత 2009 జూన్‌లో వారికి కవల పిల్లలు జన్మించారు. శిశువులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా.. వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్టు స్పష్టమయింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ వారు ఎన్‌పీడీఆర్‌సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ, దర్యాప్తు అనంతరం వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ. 1.50 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవటు ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రిలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎన్‌పీడీఆర్ కమిషన్ అభిప్రాయ పడింది.
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!