కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని… ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. హతమర్చిన ఉగ్రవాదిని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిగా గుర్తించారు. ప్రస్తుతం ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుని.. భద్రతా బలగాలు, పోలీసులు గాలింపును చేపట్టారు.
Read Also: రూ.70 కోట్లతో రాజన్న సన్నిధి అభివృద్ధి పనులు
కాగా ఇటీవల కాలంగా జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో వరసగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్ లో పెరగుతుండటంతో భద్రత బలగాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో వారానికి రెండు మూడు ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సాధారణ ప్రజా జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ప్పటికి ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు భద్రత దళాల మధ్య నిత్యం పోరు జరుగుతునే ఉంది. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో ప్రభుత్వం, భద్రత దళాలు మరింతగా అప్రమత్తం అయ్యారు. మరోవైపు సాధారణ ప్రజలు భద్రత దళాలకు సహకరించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.